భార్యను వేధించినందుకు మూడేళ్ల జైలు

భార్యను శారీరకంగా మానసికంగా వేధించిన భర్తకు న్యాయమూర్తి మూడేళ్లజైలు, రూ. 10వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.

Updated : 13 Aug 2022 06:33 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: భార్యను శారీరకంగా మానసికంగా వేధించిన భర్తకు న్యాయమూర్తి మూడేళ్లజైలు, రూ. 10వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ఏలూరు దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ సత్యనారాయణ తెలిసిన వివరాల ప్రకారం..కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాయుడుపేటకు చెందిన పెద్దింటి రమేశ్‌కు పెదివేగి మండలం కరణం గారి తోటకు చెందిన పద్మలతకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. భర్త అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని బాధితురాలు 2020లో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో రమేశ్‌ను అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో శుక్రవారం తుది విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ పూలతోటి దివాకర్‌ తీర్పునిచ్చారు. దీంతో పాటు బాధితురాలు పద్మలతకు రూ. 20 వేలు పరిహారం మంజూరు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున హేమలత వాదించారు. ఈ కేసులో మరో ఇద్దరుండగా  నేరం రుజువు కానందున వారిపై కేసు కొట్టివేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts