లారీ క్యాబిన్‌ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 10 May 2024 06:18 IST

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నగదు దొరకడంతో పోలీసులు గోప్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లారీ రాష్ట్ర సరిహద్దు దాటుతుండగా పోలీసులు తనిఖీ చేశారు. లారీ క్యాబిన్‌లో ప్రత్యేక అరలో నగదు గుర్తించారు. డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా... సొమ్ము విషయం తెలియదని చెప్పారు. హైదరాబాద్‌లో లారీని అప్పగించి.. గుంటూరు శివార్లలో లోడ్‌ దించాలని మాత్రమే చెప్పినట్లు తెలిసింది. లారీ హైదరాబాద్‌లో బయలుదేరినప్పుడు ఓ కారు దాన్ని అనుసరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. నందిగామలో ఏసీపీ రవికిరణ్‌ మాట్లాడుతూ.. నగదు ఎవరిది? ఎవరు పంపారు? ఎక్కడికి వెళ్తోందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నగదును విజయవాడలోని ఖజానా అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని