ఐఈడీ పేలి సాయుధ బలగాల ఏసీపీ మృతి

మావోయిస్టుల కోసం గాలిస్తుండగా ఐఈడీ బాంబు పేలి ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 28 Mar 2023 04:59 IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కోసం గాలిస్తుండగా ఘటన

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: మావోయిస్టుల కోసం గాలిస్తుండగా ఐఈడీ బాంబు పేలి ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తిమినార్‌ క్యాంప్‌ నుంచి ఆ రాష్ట్రానికి చెందిన సాయుధ భద్రతా బలగాలు ఎటపాల్‌ రహదారి మార్గంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఆ రహదారి మధ్యలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలపై ఉదయం 7 గంటల సమయంలో సాయుధ బలగాల అసిస్టెంట్‌ ప్లాటూన్‌ కమాండర్‌ విజయ్‌యాదవ్‌ (40) కాలు వేయడంతో ఒక్కసారిగా అవి పేలిపోయాయి. దీంతో తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం బల్లియా జిల్లాలోని రాజ్‌పుర్‌ గ్రామానికి చెందినవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు