Oxygen Mask: ఆక్సిజన్‌ మాస్క్‌కు మంటలు.. రోగి మృతి

ఆక్సిజన్‌ మాస్క్‌కు మంటలు రావడంతో రోగి మృతి చెందిన ఘటన రాజస్థాన్‌ కోట పట్టణంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

Updated : 14 Jul 2023 07:10 IST

కోట: ఆక్సిజన్‌ మాస్క్‌కు మంటలు రావడంతో రోగి మృతి చెందిన ఘటన రాజస్థాన్‌ కోట పట్టణంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైభవ్‌ శర్మ(23) అనే వ్యక్తి అనారోగ్యంతో న్యూ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న అతడికి బుధవారం రాత్రి వైద్యులు డైరెక్ట్‌ కరెంట్‌ కార్డియోవెర్షన్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ చేశారు. ఆ తర్వాత  కాసేపటికే ఆక్సిజన్‌ మాస్క్‌కు మంటలు వచ్చాయని, దీంతో వైభవ్‌ మృతి చెందాడని అతడి బంధువులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. అయితే ఆసుపత్రి అధికారులు దీన్ని ఖండించారు. వైభవ్‌కు టీబీ ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే అతడు మరణించాడని తెలిపారు. ఆక్సిజన్‌ మాస్క్‌కు మంటలు రావడం వాస్తవమే అయినా, అతడి మరణానికి అది కారణం కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిపుణుల బృందంతో దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని