Borewell: 300అడుగుల లోతైన బోరు బావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక.. సహాయక చర్యలు ముమ్మరం!

300 అడుగుల లోతైన బోరు బావిలో చిన్నారి పడిపోయినన ఘటన మధ్యప్రదేశ్‌లోని సీహోర్‌ జిల్లాలో కలకలం రేపింది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Published : 06 Jun 2023 22:50 IST

సెహోర్‌: మధ్యప్రదేశ్‌లో సీహోర్‌ జిల్లాలో రెండున్నరేళ్ల బాలిక బోరుబావి(Borewell)లో పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో చిన్నారి పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి ప్రస్తుతం 20 అడుగుల వద్ద ఇరుక్కుపోయి ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ముగావళి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సమాచారం తెలుసుకున్న సిబ్బంది జేసీబీ యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ  చిన్నారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

తన సొంత జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు.  బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, సీఎంవో కార్యాలయం అధికారులు జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉంటూ నిరంతరం పరిస్థితిని తెలుసుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని