Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు నార్కోటిక్‌  పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

Published : 23 Sep 2023 09:16 IST

హైదరాబాద్‌: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు నార్కోటిక్‌  పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేత రామచందర్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను నిందితుడిగా నార్కోటిక్ పోలీసులు చేర్చారు. అతడిని డ్రగ్స్ వినియోగదారుడిగా పేర్కొన్న పోలీసులు.. ఎవరెవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో ప్రశ్నించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు