Crime News: తపాలా కార్యాలయంలో రూ.33 లక్షలు చోరీ

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఠాణా పరిధి బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో ఉన్న ప్రధాన పోస్టల్‌ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఏకంగా రూ.33 లక్షల నగదు చోరీ చేశారు. అయితే ఈ చోరీ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం

Updated : 14 Feb 2022 04:51 IST

అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఠాణా పరిధి బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో ఉన్న ప్రధాన పోస్టల్‌ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఏకంగా రూ.33 లక్షల నగదు చోరీ చేశారు. అయితే ఈ చోరీ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం పోస్టాఫీసులో మంటలు రేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి మంటల్ని ఆర్పేసే సందర్భంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. చోరీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా దుప్పటికి నిప్పుపెట్టి అగ్నిప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అనుమానిస్తున్నారు.

* పింఛను డబ్బులు పంపిణీ చేసేందుకు పటాన్‌చెరు ఎస్బీఐ నుంచి రూ.20 లక్షలను పోస్టల్‌ అధికారులు శుక్రవారం సాయంత్రం డ్రా చేసి తెచ్చి పోస్టర్‌ కార్యాలయం లాకర్‌లో పెట్టారు. ఇది ప్రధాన పోస్టాఫీసు కావడంతో సబ్‌ ఆఫీసుల నుంచి ఇతర ఖాతాదారుల నుంచి రూ.13 లక్షల వరకూ నగదు వచ్చింది. రెండు మొత్తాలను ఒకే పోస్టల్‌ లాకర్‌లో ఉంచి అధికారులు తాళం వేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని దుండగులు లోపలకు చొరబడి లాకర్‌ను కత్తిరించి రూ.33 లక్షల నగదును దొంగిలించుకుని వెళ్లిపోయారు. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. ఇది తెలుసున్నవారి పనే అన్న అనుమానిస్తున్నారు. పోస్ట్‌మాస్టర్‌ శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని