Hyderabad: జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రలు.. ఇద్దరి అరెస్టు

జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రల స్కామ్‌లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జీహెచ్‌ఎంసీలో మరోసారి నకిలీ వేలిముద్రల స్కామ్‌ వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Published : 14 Sep 2023 19:46 IST

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రల స్కామ్‌లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జీహెచ్‌ఎంసీలో మరోసారి నకిలీ వేలిముద్రల స్కామ్‌ వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్‌వైజర్లు తయారు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో సూపర్‌వైజర్లుగా ఉన్న సాయినాథ్, నాగరాజులను అరెస్టు చేసినట్లు తూర్పు మండలం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. నకిలీ వేలిముద్రల ద్వారా విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగుల పేరుతో సూపర్‌వైజర్లు నగదు కాజేస్తున్నారని పోలీసులు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని