గుజరాత్‌ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్‌ స్వాధీనం

గుజరాత్‌ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్‌ను స్వాధీనం చేసున్నారు.

Published : 30 Apr 2024 04:40 IST

దిల్లీ: గుజరాత్‌ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్‌ను స్వాధీనం చేసున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరిని మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం కూడా దాదాపు రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  

48 కిలోల హెరాయిన్‌ పట్టివేత

చండీగఢ్‌: ఓ అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టును పంజాబ్‌ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 48 కిలోల హెరాయిన్‌, రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌, కెనడాతో పాటు దేశంలోని జమ్మూకశ్మీర్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని