Yadagirigutta: యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం పోర్టికో.. నలుగురి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం పోర్టికో కుప్పకూలింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్లో ఈ దుర్ఘటన జరిగింది. 

Updated : 29 Apr 2022 22:38 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం పోర్టికో కుప్పకూలింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. భవనం ముందు భాగంలో రెండు దుకాణాలు నిర్వహిస్తుండగా, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారితో పాటు అక్కడికి వచ్చిన పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాండేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలిన రెండంతస్తుల భవనం పోర్టికో 35ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మృతులు యాదగిరిగుట్టకు చెందిన దశరథ్‌గౌడ్‌, శ్రీను, ఉపేందర్‌, శ్రీనాథ్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని