Andhra News: కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. భయంతో జనం పరుగులు

శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది.  నిత్యం రద్దీగా ఉండే మార్గంలో భవనం కూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

Updated : 06 Oct 2022 20:33 IST

పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. భయాందోళనతో జనం పరుగులు తీశారు. పలాస కేటీ రోడ్డులో చిరు వ్యాపారం నిర్వహిస్తున్న మల్లా కామేశ్వరరావుకు చెందిన రెండు అంతస్తుల భవనం గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. భవనం శిథిలాలు పక్కనే ఉన్న పలాస మండలం శాసనాం గ్రామానికి చెందిన పార్వతీశం టీ దుకాణంపై పడ్డాయి. విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. పురపాలక సంఘం అధ్యక్షుడు బల్ల గిరిబాబు, తహసీల్దార్‌ మధుసూదన్‌, కమిషనర్‌ రాజగోపాల్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో భవనం కూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాత భవనం కావడంతో వర్షాలకు గోడలు తడిసి కూలిందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని