logo

సృజన్‌.. సాధించెన్‌

సాధారణ గీతకార్మికుడి కుమారుడు ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించే ఈ-సెట్‌లో మెరిశాడు. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామానికి చెందిన దాసరి సాయిసృజన్‌ గౌడ్‌ శుక్రవారం వెలువడిన ఈ-సెట్‌ ఫలితాల్లో మైనింగ్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో నాలుగోర్యాంకు సాధించాడు

Published : 13 Aug 2022 05:37 IST

సాయిసృజన్‌గౌడ్‌

బెల్లంపల్లి గ్రామీణం: సాధారణ గీతకార్మికుడి కుమారుడు ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించే ఈ-సెట్‌లో మెరిశాడు. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామానికి చెందిన దాసరి సాయిసృజన్‌ గౌడ్‌ శుక్రవారం వెలువడిన ఈ-సెట్‌ ఫలితాల్లో మైనింగ్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో నాలుగోర్యాంకు సాధించాడు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్థానికంగా గీతకార్మికుడిగా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మైనింగ్‌ విభాగంలో ఇంజి నీరింగ్‌ పూర్తిచేసి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సాధించి కుటుంబానికి చేయూతగా నిలుస్తానని విద్యార్థి తెలిపాడు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని