logo

బల్దియాకు నాసిరకం చీపుర్లు సరఫరా

బల్దియా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ పట్టణంలో వీధులు, రహదారులను ఊడ్చేందుకు కొనుగోలు చేసిన చీపుర్ల నాసిరకంగా ఉన్నాయి.

Published : 03 Feb 2023 04:48 IST

నాణ్యత లోపించిన చీపుర్లు

ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : బల్దియా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ పట్టణంలో వీధులు, రహదారులను ఊడ్చేందుకు కొనుగోలు చేసిన చీపుర్ల నాసిరకంగా ఉన్నాయి. బల్దియా అధికారులు చీపుర్ల కొనుగోలుకు రూ.5 లక్షలతో టెండరు పిలిచారు. వరంగల్‌కు చెందిన గుత్తేదారు టెండరు దక్కించుకుని నాసిరకంగా ఉన్న 15 వేల చీపుర్లను సరఫరా చేశారు. వాటిని వినియోగిస్తే త్వరగానే చెడిపోయేలా ఉండటంతో గమనించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ కమిషనర్‌ ఎ.శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశంతో వాటిని వెనక్కి పంపించాలని నిర్ణయించారు. గుత్తేదారుతో ఫోన్‌లో మాట్లాడగా వాటి స్థానంలో మన్నికైన చీపుర్లను పంపిస్తామని చెప్పారు. దీంతో గురువారం వాటిని లారీలో వెనక్కి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని