logo

సైబర్‌ కేసులో మరో ముగ్గురు..!

సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ ఖాతాలు సమకూర్చిన కేసులో ఇదివరకే పట్టణానికి చెందిన షిండే ప్రణయ్‌ను సైబర్‌ క్రైం బ్యూరో (సీసీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Published : 04 May 2024 06:00 IST

భైంసా, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ ఖాతాలు సమకూర్చిన కేసులో ఇదివరకే పట్టణానికి చెందిన షిండే ప్రణయ్‌ను సైబర్‌ క్రైం బ్యూరో (సీసీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా అదే కేసుకు సంబంధించి మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రణయ్‌కు వీరు సహకరించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌ నిర్వహణలోనూ వీరి భాగస్వామ్యం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఏఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ను సంప్రదించగా ముగ్గురిని సైబర్‌ క్రైం బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారిలో నవీన్‌, లక్ష్మణ్‌తో పాటు మరొకరు ఉన్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని