logo

జిల్లా జోలికొస్తే భీం స్ఫూర్తిగా పోరాడుతాం

అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Published : 04 May 2024 06:20 IST

నాయకులతో కలిసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజల వద్దకు పాలనను తీసుకొస్తూ జిల్లాలను అందుబాటులోకి తెస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల కుదింపునకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. కుమురం భీం జిల్లాను కుదించే చర్యలు పూనుకొంటే కుమురం భీం స్ఫూర్తిగా తిరగబడతామని హెచ్చరించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాను తొలగిస్తే అభివృద్ధి కుంటుబడి ఆదివాసీలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. కుమురం భీం ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, పూర్తికాకుండానే ప్రారంభించి నాణ్యతకు తిలోదకాలిచ్చాని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నచోటే అభివృద్ధి చేస్తారా? లేకపోతే చేయరా? అని ప్రశ్నించారు. సింగిల్‌ విండో ఛైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు చిలువేరు వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని