logo

ఓట్లు వేసేలా చైతన్యపరచాలి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులను ఓటు వేయించేలా వారిని చైతన్య పరచాలని నృత్య శిక్షకురాలు గండ్రత్ అవంతిక పిల్లలను సూచించారు.

Published : 05 May 2024 18:24 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులను ఓటు వేయించేలా వారిని చైతన్య పరచాలని నృత్య శిక్షకురాలు గండ్రత్ అవంతిక పిల్లలను సూచించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో ఆదివారం వేసవి నృత్య శిక్షణ శిబిరంలో ఆమె ఓటుహక్కు, ఓటు విలువ గురించి అవగాహన కలిగించారు. ఇంటి పెద్దలు ఓటు వేసిన అనంతరం కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమంలో పొందుపర్చాలని కోరారు. దేశంలోనే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదుకు పాలనాధికారి రాజర్షిషా చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకుని తమవంతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆమె తెలిపారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉదయం వేళలోనే ఓటు వేసేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని