logo

పంచాయతీ కార్యదర్శులు ఓటేశారు!

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేస్తామో.. లేదో? అన్న ఆందోళనలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వారికి పోస్టల్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు.

Published : 09 May 2024 06:48 IST

ఆదిలాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పంచాయతీ కార్యదర్శులు

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేస్తామో.. లేదో? అన్న ఆందోళనలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వారికి పోస్టల్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ‘ఈనాడు’లో బుధవారం ‘ఓటు వేసేదెలా?’ శీర్షికన పంచాయతీ కార్యదర్శుల ఆందోళనపై కథనం ప్రచురితమైంది. స్పందించిన రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాలు పంచాయతీ కార్యదర్శులంతా బుధవారం ఆయా ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ ఓటుకు దూరంగా వారంతా ఆదిలాబాద్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. మొత్తం 334 మంది పంచాయతీ కార్యదర్శులు పోస్టల్‌ ఓటును వినియోగించుకున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి పంచాయతీ అధికారి ఫణిందర్‌రావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మరోవైపు ‘ఈనాడు’ చొరవతో పంచాయతీ కార్యదర్శులు పోస్టల్‌ ఓటును వినియోగించుకోగలిగారని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం కన్వీనర్‌ కురాడి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. అందుకు రిటర్నింగ్‌ అధికారికి, ‘ఈనాడు’కు కార్యదర్శుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

బోథ్‌లో ఓటేసిన పంచాయతీ కార్యదర్శులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని