logo

మహనీయులందర్నీ స్మరించుకోవాలి

దేశంలో స్వేచ్ఛాయుతమైన జీవనం సాగించేందుకు పాటుపడిన మహనీయులందర్నీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 02:28 IST

రంపచోడవరంలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న

ఎమ్మెల్యే ధనలక్ష్మి, పీవో గనోరే, సబ్‌ కలెక్టర్‌ బన్సల్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: దేశంలో స్వేచ్ఛాయుతమైన జీవనం సాగించేందుకు పాటుపడిన మహనీయులందర్నీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో గణతంత్ర దిన వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను పీవో ఎగురవేశారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ పాల్గొన్నారు. ఉత్తమ సేవలు, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంపీపీ బంధం శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

నిధుల్లేక మొక్కుబడిగా వేడుకలు

ఏటా గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంతో అట్టహాసంగా నిర్వహించేవారు. ఈసారి ఐటీడీఏ అధికారులు మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. నిధులు లేకపోవడం వల్లే వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయామని పలువురు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని