logo

మౌలిక వసతుల్లేక అభివృద్ధికి దూరం

న్యూస్‌టుడే: పీవీటీజీల జీవన విధానంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. శనివారం ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ అర్లోయిపుట్టు, పెదబయలు మండలంలోని పలు గ్రామాల్లో బృంద సభ్యులు పర్యటించారు.

Published : 29 Jan 2023 03:19 IST

అర్లోయిపుట్టులో ఆదివాసులతో మాట్లాడుతున్న అధ్యయన బృంద సభ్యులు

ముంచంగిపుట్టు, పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పీవీటీజీల జీవన విధానంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. శనివారం ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ అర్లోయిపుట్టు, పెదబయలు మండలంలోని పలు గ్రామాల్లో బృంద సభ్యులు పర్యటించారు. వారి జీవన స్థితిగతులపై ఆరా తీశారు. దిల్లీ నుంచి వచ్చిన గిరిజన సంక్షేమ అఫైర్‌ కమిటీ కార్యదర్శి కొంజుబీహారీ, పాడేరు ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం (టీసీఆర్‌టీఎం) ప్రొఫెసర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ ఈ బృందంలో ఉన్నారు. సర్పంచి త్రినాథ్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, సామాజిక భవనాలు తదితర మౌలిక సదుపాయాలు లేక ఆదివాసీ గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని అధికారులకు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీ గ్రామాల్లో విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని