logo

మోదకొండమ్మ జాతర నేడు

మాడుగులలో కొలువైన మోదకొండమ్మ జాతర మంగళవారం ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించి ఎంపీపీ రామధర్మజ, ఆలయ కమిటీ ఛైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, బీమరసెట్టి పైడినాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated : 06 Jun 2023 05:48 IST

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగులలో కొలువైన మోదకొండమ్మ జాతర మంగళవారం ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించి ఎంపీపీ రామధర్మజ, ఆలయ కమిటీ ఛైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, బీమరసెట్టి పైడినాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని సన్నాయి మేళతాళాలతో మేలుకొలుపు చేస్తారు. అమ్మవారిని వెండి, బంగారు నగలతో అందంగా అలంకరిస్తారు. పసుపు, కుంకుమ, పూలతో అభిషేకాలు పూర్తి చేసి భక్తుల దర్శనాలకు వీలు కల్పిస్తారు. అమ్మవారి ఆలయంలో మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గర్భగుడిలో దర్శనాలకు అనుమతిస్తారు. భక్తుల వసతి నిమిత్తం ఆలయంలో నాలుగు పెద్ద హాళ్లు, 12 గదులు అందుబాటులో ఉంచారు.  

మన్యం దేవతగా పేరు : కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా మోదకొండమ్మకు పేరుంది. అమ్మవారు పాడేరు వెళ్లే మార్గంలోని మినుములూరు వద్ద వెలిశారని ప్రతీతి. అక్కడ పాదాలు పెట్టి పూజలు చేస్తుంటే క్రమంగా పాడేరు, మాడుగులకు అమ్మవారి మహత్యాలు తెలిసి ఇక్కడా ప్రత్యేక ఆలయాలను నిర్మించారు. ఏటా ఈ ఆలయాల్లోనూ భారీగా ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

* మే 5న అమ్మవారి పాదాలు, ఘటాలను నెలరోజులు కొలువు తీర్చేందుకు మేళతాళాలతో పట్టణంలోకి తెచ్చారు. నెలరోజుల కొలువు అనంతరం జాతరతో పండగ ముగుస్తుంది. దాంతో మహారాజా కోట వద్ద కొలువుదీరిన అమ్మవారి సతకం పట్టుకు స్వస్తి చెబుతారు. అమ్మవారి జాతర సందర్భంగా వివిధ మాడుగులలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని