logo

మే నెలలో ప‘రేషన్‌’ తప్పదా..!

మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.

Published : 30 Apr 2024 03:18 IST

మూడో వంతు డిపోలకు చేరని సరకులు
సరఫరాకు ససేమిరా అంటున్న హమాలీలు

ఎండీయూ వాహనం వద్ద కార్డుదారులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. పౌరసరఫరాల సంస్థ (సీఎస్‌సీ) రాష్ట్ర అధికారులు తీసుకున్న నిర్ణయం దీనికి కారణమైంది. నగర పరిధిలో రేషన్‌ డిపోలకు సరకులు చేరవేసేందుకు మర్రిపాలెంలో డిపో-1, డిపో-2 రెండు గోదాములు ఉన్నాయి. గోదాము-1 పరిధిలోని రేషన్‌ డిపోలకు సరకుల చేరవేతకు క్వింటాలుకు రూ.21 వరకు సీఎస్‌సీ ఖర్చు చేస్తోంది. గోదాము-2 పరిధిలోని వాటికి రూ.30 వరకు ఖర్చు చేస్తోంది.

  • రవాణా ఖర్చులను తగ్గించే క్రమంలో గోదాము-2 పరిధిలోని చౌక డిపోలను గోదాము-1కు, మధురవాడ తదితర ప్రాంతాల్లోని వాటిని భీమునిపట్నం గోదాముకు కేటాయించారు. గోదాము-2 నుంచి 100కుపైగా రేషను డిపోలు వీడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న హమాలీలు ఆదాయం కోల్పోయారు. దీంతో వారు భీమునిపట్నం గోదాముకు వెళ్లిన 25 చౌక డిపోల్లో సరకును ఎట్టి పరిస్థితిలో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేయరాదని డిమాండ్‌ చేస్తూ అక్కడి పనులను అడ్డుకున్నారు. మరో పక్క గోదాము-1 పరిధిలో రేషను డిపోలు పెరగడంతో వాటిల్లో అధిక శాతానికి సరకులు చేరలేదు.
  • జిల్లా వ్యాప్తంగా 600 డిపోలుంటే ప్రస్తుతం 400 డిపోలకు మాత్రమే సరకులు చేరాయి. ఒక్క రోజే గడువు ఉంది. దీంతో ఈనెల 1వ తేదీన తక్కువ మందికి రేషన్‌ అందే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని