logo

ప్రధాని రోడ్‌ షోలో అప్రమత్తంగా ఉండండి

ప్రధాన మంత్రి రోడ్‌ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ అన్నారు.

Published : 08 May 2024 07:10 IST

పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
పోలీసులకు సీపీ దిశానిర్దేశం

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే : ప్రధాన మంత్రి రోడ్‌ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని ఆంధ్రా లయోల కళాశాల దేవయ్య ఆడిటోరియంలో మంగళవారం పోలీస్‌ అధికారులకు సీపీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పర్యవేక్షణ పెంచాలన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వీక్షకులకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన మార్గాలను తెలియజెప్పాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌కు, ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలన్నారు. ప్రధాని రోడ్‌ షోలో భాగంగా బందోబస్తు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టం చేయాలని, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీస్‌, కట్‌ ఆఫ్‌ పార్టీస్‌, రూఫ్‌ టాప్స్‌, రోప్‌ పార్టీస్‌, యాంటి సబ్‌ టేజ్‌ చెక్‌... వివిధ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఆరుగురు ఐపీఎస్‌, 7 గురు డీసీపీలు, ఏడీసీపీలు 22 మంది, ఏసీపీలు 50 మంది, ఇన్‌స్పెక్టర్లు 136 మంది, ఎస్సైలు 250 మంది సిబ్బందితో కలిపి 5 వేల మంది లా అండ్‌ ఆర్డర్‌, ఏఆర్‌., ఏపీఎస్‌పీ, పారా మిలటరీ బలగాలతో భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపాలన్నారు. ఐజీపీ కె.వి.మోహన్‌రావు, డి.ఐ.జి. గోపినాథ్‌ జెట్టి, ఎ.ఐ.జి. ఎం.రవీంద్రనాథ్‌ బాబు, వకుల్‌ జిందాల్‌, మల్లికా గార్గ్‌, దామోదర్‌, డీసీపీలు శ్రీనివాసరావు, అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఉదయరాణి, కీరముల్లా, చక్రవర్తి, హరికృష్ణ, బి.రామకృష్ణ ఇతర అధికారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని