Published : 26 Jan 2022 04:10 IST
ఏసీ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు
ఈనాడు, విశాఖపట్నం : ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీˆ శుభవార్త తెచ్చింది. కొన్ని మార్గాల్లో కొంత కాలం పాటు ఛార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా విశాఖ నుంచి మూడు మార్గాల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 20 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విశాఖ- ఇచ్ఛాపురం, విశాఖ-విజయవాడ, విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ఏసీˆ బస్సుల్లో ఈ తగ్గింపు ఉంటుందన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు దీన్ని అమలు చేయనున్నారు. రోజూ విశాఖ నుంచి హైదరాబాద్కు 3, విజయవాడకు 13, ఇచ్ఛాపురం రెండు ఏసీ బస్సులు వెళ్తాయి. భవిష్యత్తులో రాజమహేంద్రవరం, కాకినాడ మార్గాల్లోనూ పరిశీలించనున్నారు.
Tags :