logo

మద్యం సీసాల ధ్వంసం

సెబ్‌ కార్యాలయ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను బుక్కరాయసముద్రంలో డీఎస్పీ శ్రీనివాసులు, సెబ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ గత రెండేళ్లుగా స్థానిక

Updated : 24 May 2022 06:18 IST

మద్యం సీసాలను జేసీబీతో ధ్వంసం చేయిస్తున్న పోలీసులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: సెబ్‌ కార్యాలయ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను బుక్కరాయసముద్రంలో డీఎస్పీ శ్రీనివాసులు, సెబ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ గత రెండేళ్లుగా స్థానిక పోలీసుస్టేషన్‌, సెబ్‌ కార్యాలయం పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ రూ.3 లక్షల విలులైన 24 కేసుల మద్యం సీసాలను జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై శివప్రసాద్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అనంత నేరవార్తలు: ఎన్డీపీఎల్‌ కేసుల్లో సీజ్‌ చేసిన రూ.3,75,044 విలువ చేసే ఇతర రాష్ట్రాల మద్యాన్ని అనంత గ్రామీణం పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు డీఎస్పీ ఆంథోనప్ప, అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సెబ్‌ విభాగం సిబ్బంది ధ్వంసం చేశారు. 30 ఎన్డీపీఎల్‌ కేసుల్లో సీజ్‌ చేసిన కర్ణాటక, ఇతర రాష్ట్రాల మద్యాన్ని టీవీ టవర్‌ సమీపంలోని బయలు ప్రదేశంలో రోడ్డు రోలరుతో తొక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని