logo

రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

Published : 19 Apr 2024 03:46 IST

ఓటు అభ్యర్థిస్తున్న పయ్యావుల కేశవ్‌

విడపనకల్లు, ఉరవకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. గురువారం ఆయన విడపనకల్లు మండలం చీకలగురికి, ఉండబండ, పాల్తూరు, హావళిగి, కరకముక్కల గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ ఓటు అభ్యర్థించారు. కరవుతో రైతులు విలవిల్లాడినా ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. రైతులంటే వైకాపాకు కనికరం లేదన్నారు. విడపనకల్లు మండలంలో గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ) కింద రైతులు వేలాది ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తే, వాటిని కాపాడటానికి కృష్ణా జలాలను తరలించడంలోనూ ఇక్కడి వైకాపా నాయకులు ఘోరంగా విఫలం చెందారన్నారు. దాంతో రైతులు పెద్ద సంఖ్యలో నష్ట పోయారన్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన జగన్‌, దానిని ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇస్తూనే, మరో చేత్తో రెట్టింపు స్థాయిలో లాగేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్‌ చిన్న మారయ్య, మాజీ ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, నాయకులు పద్మావతి, చంద్రశేఖర్‌, జనార్దన్‌నాయుడు, తిప్పారెడ్డి, వన్నూరుస్వామి, దేవేంద్ర, కాలువ మారయ్య, కుమారస్వామి, తిమ్మప్ప, సన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని