logo

వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం

వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 01 May 2024 03:55 IST

విరుపాపల్లి గ్రామస్థులతో పయ్యావుల కేశవ్‌

బెళుగుప్ప, న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. బెళుగుప్ప మండలంలోని కోనాపురం, శీర్పి, విరుపాపల్లి, యలగలవంక, నరసాపురం, రమణేపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. గ్రామస్థులు గజమాలతో స్వాగతం పలికారు. శీర్పిలో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యం అన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఒక్క రాయితీ రుణం ప్రజలకు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శీర్పి నుంచి విరుపాపల్లి గ్రామానికి రహదారి, మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆగిపోయిన కాలువ పనులను పూర్తి చేసి చెరువులకు నీటిని అందించి రైతులను ఆదుకుంటామన్నారు. వైకాపా ప్రభుత్వంలో మండలంలో కాలువ పనుల కోసం ఒక గంప మట్టి కూడా తవ్వలేదన్నారు. అలాంటి అసమర్థ నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని