logo

భారీగా నగదు పట్టివేత

అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంత అర్బన్‌ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు.

Published : 01 May 2024 03:53 IST

స్వాధీనం చేసుకున్న నగదు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంత అర్బన్‌ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్తు నగర్‌ కూడలిలో ఉదయం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ క్రాంతికుమార్‌, ఎస్సై రుష్యేంద్రబాబు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం ఇన్‌ఛార్జి భీమలింగేశ్వర ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అటువైపు వచ్చిన ఫార్చునర్‌ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో రెండు బ్యాగుల్లో తరలిస్తున్న రూ.1,99,97,500 నగదును పోలీసులు సీజ్‌ చేశారు. వాహనం రికార్డులను పరిశీలించగా కదిరి తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేరున ఉన్నట్లు తేలింది. డ్రైవర్‌ వెల్లడించిన అంశాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. సీజ్‌ చేసిన నగదును టూటౌన్‌ పోలీసులు అనంతపురం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు