logo

లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం

తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

Published : 24 Apr 2024 04:57 IST

డప్పు కొట్టి నాయకుల్లో ఉత్సాహం నింపుతున్న బాలయ్య

న్యూస్‌టుడే, లేపాక్షి  : తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మంగళవారం ప్రచారం చేస్తూ ఆయన మాట్లాడారు. లేపాక్షిని యునెస్కో జాబితాలో చేర్చడానికి అవసరమైన డోసియర్‌ను కేంద్రానికి పంపడంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన వెంటనే యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయప్ప, రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, మాజీ ఎంపీపీ ఆనంద్‌కుమార్‌, నాయకులు సూర్యప్రకాష్‌, మారుతీప్రసాద్‌, సర్పంచి సిద్ధార్థ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.  

వెయ్‌.. గెలుపు దరువేయ్‌..

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేపాక్షి మండలంలో రెండోరోజైన మంగళవారం ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరితో చేతులు కలుపుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొండూరులో డప్పు కొట్టి కూటమి నాయకుల్లో ఉత్సాహం నింపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని