logo

గొడవలపై ఉక్కుపాదం మోపండి

‘ఎన్నికల నిర్వహణను సవాల్‌గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా పేర్కొన్నారు.

Published : 06 May 2024 06:48 IST

జిల్లా అధికారులతో ప్రత్యేక పరిశీలకుడు దీపక్‌మిశ్రా

మాట్లాడుతున్న దీపక్‌మిశ్రా, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, డీఐజీ అమ్మిరెడ్డి, పరిశీలకులు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌): ‘ఎన్నికల నిర్వహణను సవాల్‌గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా పేర్కొన్నారు. ఆదివారం ఆయన అనంత నగరానికి వచ్చారు. నగరంలో బస చేసిన ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కలెక్టర్‌ కార్యాలయ మినీ కాన్ఫరెన్సు హాలులో సాధారణ, పోలీసు పరిశీలకులు, కలెక్టర్‌, జేసీ, ఇతర ఐఏఎస్‌ అధికారులు, అదనపు ఎస్పీ, డీఎస్పీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలను ఉన్నతంగా నిర్వహించడం మన బాధ్యతగా భావించాలన్నారు. వెబ్ కాస్టింగ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీఎం మానిటరింట్‌, హోమ్‌ ఓటింగ్‌ వంటి ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.  కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. 20.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అమిత్‌బర్దర్‌, సాధారణ, పోలీసు పరిశీలకులు మనీష్‌ సింగ్‌, అజయ్‌నాథ్‌ ఝు, రవికుమార్‌, విలాస్‌ వి.షిండే, నితిన్‌ అగర్వాల్‌, రాందాస్‌ టి.కాలే, జేసీ కేతన్‌గార్గ్‌, జడ్పీ సీఈఓ నిదియాదేవి, నగర కమిషనర్‌ స్వరూప్‌, సహాయ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు