logo

రాకపోకలకు నిత్య నరకం

ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి.

Published : 05 May 2024 03:52 IST

వంతెనల మరమ్మతులు పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
ఒకటిన్నరేళ్లలో నిధులు మంజూరు చేయని జగన్‌

ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. నెలల తరబడి తీవ్ర అవస్థల అనంతరం అక్కడక్కడ తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఆ తర్వాత శాశ్వత నిర్మాణాల కోసం నిధులు విడుదల చేయకుండా ప్రతిపాదనలకే పరిమితం చేసింది. దీంతో ఒకటిన్నరేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల నడుమ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల ప్రజలు వ్యయప్రయాసలకోర్చి చుట్టూ తిరిగి వెళుతున్నారు. ప్రభుత్వం వంతెనల నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

న్యూస్‌టుడే బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని