logo

స్కానింగ్‌ కేంద్రాల్లో వైద్యాధికారుల తనిఖీలు

చిత్తూరు, పుత్తూరులోని పలు స్కానింగ్‌ కేంద్రాల్లో గురువారం డీఎంహెచ్‌వో శ్రీహరి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనల అతిక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు స్కానింగ్‌

Updated : 30 Sep 2022 03:40 IST

స్కానింగ్‌ కేంద్ర నిర్వాహకులు, వైద్యులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో శ్రీహరి

చిత్తూరు(వైద్యం): చిత్తూరు, పుత్తూరులోని పలు స్కానింగ్‌ కేంద్రాల్లో గురువారం డీఎంహెచ్‌వో శ్రీహరి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనల అతిక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు స్కానింగ్‌ యంత్రాలు సీజ్‌ చేశారు. ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలను అక్కడి నిర్వాహకులు బహిర్గతం చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించారు. చిత్తూరులోని వీకేఆర్‌ స్కానింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ స్కానింగ్‌ యంత్రాలు పక్కన పెట్టినా అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు లేకపోవడంపై ప్రశ్నించి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధు స్కానింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి అగ్నిప్రమాద నిరోధకాలు లేవని గుర్తించి ఆయా నిబంధనలు సైతం పాటించాలని ఆదేశించారు. పుత్తూరులోని ఓ స్కానింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని