logo

590 పోలింగ్‌ కేంద్రాల్లో కొత్త ఓటర్లే లేరు: కలెక్టర్‌

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2023లో భాగంగా జిల్లాలోని 590 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో కొత్తగా ఒక్క ఓటరూ నమోదు కాలేదని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు.

Published : 03 Dec 2022 01:52 IST

విద్యాదీవెన లబ్ధిదారులు ఓటర్లేనా?

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2023లో భాగంగా జిల్లాలోని 590 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో కొత్తగా ఒక్క ఓటరూ నమోదు కాలేదని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బీఎల్‌వోలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. 17 నుంచి 18 ఏళ్లలోపు వారి నుంచి దరఖాస్తులు సేకరించా లన్నారు. ఫారం-6 దరఖాస్తుల్ని త్వరగా పరిష్కరించాలని, విద్యాదీవెన లబ్ధిదారులు ఓటరుగా ఉన్నారా? లేదా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. ఓటరు కార్డు-ఆధార్‌ అనుసంధానాన్ని ఈ నెల 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జేసీ వెంకటేశ్వర్‌, శిక్షణ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, డీఆర్‌వో రాజశేఖర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ః రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. స్పందన అర్జీల పరిష్కారం, ఫ్యామిలీ డాక్టర్‌ సేవల్ని పారదర్శకంగా చేపట్టామన్నారు. 206 సచివాలయ భవనాలు, 227 ఆర్‌బీకేలు, 238 హెల్త్‌ క్లీనిక్స్‌ భవనాలు పురోగతిలో ఉన్నట్లు కలెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని