తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు : తితిదే ఈవో ధర్మారెడ్డి
బర్డ్‌లో తక్కువ ఖర్చుకే రక్త పరీక్షలు నిర్వహించి ఫలితాలు త్వరగా ఇవ్వనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
కేంద్రీయ రక్త పరీక్షల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి
తిరుపతి(వైద్యం), న్యూస్‌టుడే: బర్డ్‌లో తక్కువ ఖర్చుకే రక్త పరీక్షలు నిర్వహించి ఫలితాలు త్వరగా ఇవ్వనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రిలో అత్యాధునిక కేంద్రీయ రక్త పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ.. బర్డ్, శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చే రోగుల నిమిత్తం రూ.80 లక్షలతో నూతన కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. హెమటాలజి, సెరాలజి, కోమా గూలేషన్, బయో కెమిస్ట్రీ విభాగాలకు చెందిన రక్త పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. స్విమ్స్, రుయాతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులకు కూడా తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బర్డ్‌లో అత్యాధునిక పరికరాలతో కూడిన బ్లడ్ బ్యాంకును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. రోజూ 40- 45 యూనిట్ల రక్తం స్విమ్స్, రుయా, ప్రసూతి, ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బర్డ్‌లో రోజూ 400 ఓపీలు, 20 సర్జరీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇటీవల గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న రోగిని పలకరించి ఆరోగ్య విషయాలు ఆరా తీశారు. కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, బర్డ్ ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి, చిన్న పిల్లల ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్‌రెడ్డి
-
India News
PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా