logo

పురాతన శిలాశాసనం లభ్యం

తిరుపతి జిల్లా వడమాలపేట, ఏర్పేడు మండలాల పరిధిలోని సదాశివకోనలో పురాతన శిలాశాసనం సోమవారం లభ్యమైంది.

Published : 21 Mar 2023 03:02 IST

సదాశివకోనలో లభ్యమైన పురాతన శిలాశాసనం

పుత్తూరు, ఏర్పేడు, వడమాలపేట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా వడమాలపేట, ఏర్పేడు మండలాల పరిధిలోని సదాశివకోనలో పురాతన శిలాశాసనం సోమవారం లభ్యమైంది. ఇది తెలుగులో శాఖయుగం 147(6) ఆనంద, శ్రావణ, భ 10, మంగళవారం= 1554 సీఈ ఆగస్టు 22వ తేదీన చెక్కబడినట్లు దానిపై ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజు సదాశివదేవరాయల వద్ద పనిచేసిన అధికారి నరసింహ సదాశివకోన వద్ద ఓ ట్యాంకు నిర్మాణానికి, గుడిమల్లం వద్ద ఉన్న శ్రీ పరశురామే శ్వర ఆలయానికి కొన్ని విరాళాలు అందించినట్లు ఆ శిలాశాసనంలో పొందుపరిచారు. ఇది ఏర్పేడు మండలంలోని పాయల్‌ సెంటర్‌కు 15 కిమీ దూరంలోని అటవీ ప్రాంతంలోని ఓ దేవత ఆలయం సమీపాన ఉన్నట్లు వడమాలపేటకు చెందిన మామిడికాయల వ్యాపారి జి.మురళి కనుగొని తిరుపతిలోని ఆర్కియాలజీ అధికారులకు సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని