logo

రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్‌కు నో ఎంట్రీ

ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది.

Published : 26 Apr 2024 04:14 IST

కలెక్టరేట్‌ బయట రెడ్డెప్ప(తెల్ల షర్టు ధరించిన వ్యక్తి)

చిత్తూరు కలెక్టరేట్‌, ఈనాడు చిత్తూరు: ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. సరిగ్గా 3.02 గంటలకు.. చిత్తూరు ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు పలమనేరుకు చెందిన రెడ్డెప్ప. తనను అనుమతించాలని విధుల్లో ఉన్న పోలీసులకు విన్నవించారు. స్పందించిన పోలీసులు 3 గంటలకే సమయం ముగిసింది. సమయం ముగిశాక అనుమతించడం కుదరదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు సదరు అభ్యర్థి. గడచిన కాలం తిరిగిరానిది, ఎంతో విలువైనదంటారు. ఈ సంఘటన.. కాలం విలువకు ఒక ఉదాహరణ. రెబల్‌గా బరిలో ఉంటా.. తాను వైకాపా రెబల్‌ అభ్యర్థిగా చిత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని 30వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ సుష్మ భర్త రియాజ్‌బాషా స్పష్టం చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం ఆయన తన నామపత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులుకు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌ గతంలో వాలంటీర్‌ను ఎమ్మెల్యేగా నిలబెడతామని చెప్పారు. ఈ ఎన్నికల సమయంలో ఆ మాటను సీఎం నిలబెట్టుకోలేకపోయారు. నేను ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. నాకు ప్రజాబలం ఉంది’ అని రియాజ్‌బాషా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని