logo

జేఈఈలో జయకేతనం

తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్‌  ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్‌ అనిపించారు.

Published : 26 Apr 2024 04:40 IST

జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు

తిరుపతి (బైరాగిపట్టెడ), శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్‌  ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్‌ అనిపించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షలో మంచి పర్సంటైల్స్‌తో పాటు అడ్వాన్సుడ్‌కు అర్హత సాధించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ ప్రవేశపరీక్షలు రెండు విడతలుగా నిర్వహించింది. రెండింటిలోనూ వచ్చిన మార్కులు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. విజయానికి దోహదపడిన అంశాలు, భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలపై విజేతల వివరాలు..

ర్యాంకు 225

  •  విద్యార్థి పేరు : రాయపాటి పుష్కర్‌
  •  ఊరు: తిరుపతి
  •  తల్లిదండ్రులు : అభినందన (హెల్త్‌అసిస్టెంట్‌), రాయపాటి నాగేశ్వర నాయుడు (ఉపాధ్యాయుడు)
  •  శ్రమించిన తీరు: ఐఐటీ సాధించాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. రోజూ సన్నద్ధతకు షెడ్యూల్‌ రూపొందించుకుని చదవడంతోపాటు, ఎప్పటికప్పుడు సబ్జెక్టులో అనుమానాలు నివృత్తి చేసుకోవడం విజయానికి దోహదం పడింది.
  •  లక్ష్యం : ఐఐటీలో సీఎస్‌ఈ పూర్తిచేయడం.

    ఈడబ్ల్యూఎస్‌ రెండో ర్యాంకు

  •  గుండా జోష్మిత
  •  కరకంబాడి, తిరుపతి
  • - సుమలత, శ్రీనివాస్‌ (వ్యాపారం)
  • - రోజూ 10-12 గంటలు కష్టపడి చదవడం, అధ్యాపకుల సూచనలు పాటించడం.
  • - ఐఐటీలో సీఎస్‌ఈ పూర్తిచేయడం.

    ర్యాంకు 253

​​​​​​​

  •  యశ్వంత్‌  కుమార్‌ రెడ్డి
  •  శ్రీకాళహస్తి
  •  ప్రవీణ, సురేంద్రరెడ్డి
  •  రోజూ 15 గంటలు కష్టపడి చదవడం, ఆన్‌లైన్‌లో పరీక్షలు, క్లిష్టమైన సమస్యలను సాధన చేయడం, అనుమానాలు నివృత్తి చేసుకోవడం.
  •  ఐఐటీ
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని