logo

నేడు, రేపు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్‌వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు..

Published : 05 May 2024 03:16 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్‌వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు.. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల్లోగా ఫెసిలిటేషన్‌ సెంటర్లకు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి. 6, 7 తేదీల్లో హోం ఓటింగ్‌ చేపట్టాలి. గత నెల 26లోగా దరఖాస్తు చేసుకోని సిబ్బంది నేరుగా ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ధ్రువపత్రాలు చూపి బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఇతర జిల్లాలో ఓటు కల్గి.. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నవారు 5, 6 తేదీల్లో కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు.

ఇలా చెల్లుబాటు చేద్దాం..

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై పలు సూచనలు చేశారు.

  • మీ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు, దాని కోడ్‌ నంబర్‌ తెలుసుకోవాలి. మీ ఓటు ఉన్న పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ ఓటరు జాబితాలో మీ ఓటు క్రమసంఖ్య తెలుసుకోవాలి.
  • ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లిన తర్వాత 13ఏ డిక్లరేషన్‌, 13బి కవర్‌ ఏ, 13సి కవర్‌ బి, ఫాం-13డి సూచనలు, బ్యాలెట్‌ ఇస్తారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిచేయాలి.
  • 13ఏ పూరించి అందులో మీకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌ సీరియల్‌ నంబర్‌ తప్పక రాయాలి. మీ సంతకం, గెజిటెడ్‌ అధికారి సంతకం చేయించాలి. గెజిటెడ్‌ అధికారి అక్కడే అందుబాటులో ఉంటారు.
  • 13బి(ఏ ఇన్నర్‌ కవర్‌) పూర్తి చేయాలి. 13బిలో కూడా మీ పోస్టల్‌ బ్యాలెట్‌ సీరియల్‌ నంబరు తప్పక రాయాలి. అలా వేయకుంటే అది ఇన్‌వ్యాలిడ్‌ అవుతుంది. టిక్‌ చేసిన బ్యాలెట్‌ అందులో పెట్టి సీల్‌ వేయాలి.
  • 13సి ఔటర్‌ కవర్‌లో 13బి ఇన్నర్‌ కవరును, 13ఏ డిక్లరేషన్‌ ఉంచి సీల్‌ చేసి కవర్‌పై వివరాలు పూర్తిచేయాలి. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ వేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని