logo

సీఈసీ స్పందన హర్షణీయం

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు.

Published : 07 May 2024 02:52 IST

బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌

పుంగనూరు, న్యూస్‌టుడే: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు. ఇటీవల సదుంలో జరిగిన అల్లర్లలో తనపై తప్పుడు కేసు నమోదు చేయడంలో డీఐజీ పాత్రపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారించిన ఎన్నికల అధికారుల నివేదికతోనే ఆయనపై చర్యలు తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సదుం ఎస్సై, పుంగనూరు సీఐలను బాధ్యులను చేయాలని విన్నవించినట్లు ప్రకటనలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని