logo

‘రాక్షస పాలనకు అంతం పలకండి’

మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ పిలుపునిచ్చారు.

Published : 07 May 2024 02:58 IST

నగరి: వేలావడిలో తెదేపాలో చేరిన ముస్లింలతో గాలి భానుప్రకాష్‌

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని 45, 46, 47, 48, 49వ డివిజన్ల పరిధిలోని పంట్రాంపల్లి, పాంచాలిపురం, రాజుగుడి, ఓబనపల్లి కాలనీ, బొజ్జయనాయుడు వీధి, దుర్గానగర్‌కాలనీ, కోడిగుంట ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 19వ డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బాలాజీ, గురజాల ప్రతిమ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. 27, 28వ డివిజన్లలో సీకేబాబు తనయుడు సాయికృష్ణారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బజారువీధి, ఛర్చివీధిలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోకా ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, సర్పంచులు ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్‌ కఠారి హేమలత, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, చెన్నకేశవనాయుడు పాల్గొన్నారు. చిత్తూరు గ్రామీణ: మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, జిల్లా సమన్వయకర్త చంద్రప్రకాష్‌ చెర్లోపల్లెలో ప్రచారం చేశారు. పాలసముద్రం: ఎమ్మెల్యే అభ్యర్ధి థామస్‌.. బాలకృష్ణాపురం, పాలసముద్రం, శ్రీకావేరిరాజుపురం గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి చిట్టిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యలు బాబునాయుడు, మాజీ ఎంపీపీ ఇందిరమ్మ పాల్గొ న్నారు. కార్వేటినగరం: ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌.. బండ్రేవు, వడ్డిండ్లు, తూర్పు అరుంధతివాడ, చాకలివాని గుంటలో బాబు స్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమూరులో చిత్తూరు పార్లమెంటు తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి హరిబాబు నాయుడు, మండల అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు ఆధ్వర్యంలో టీఎన్‌టీయూసీ, భాజపా నాయకులు ప్రచారం చేశారు. నగరి: వేలావడిలో ముస్లింలు.. గాలి భానుప్రకాష్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. విజయపురం: ఎమ్యెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్‌.. గాండ్లకండ్రిగలో గాండ్ల సంఘం నేత శరవణ అధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పన్నూరు బీసీకాలనీలో వెంకటేశ్‌ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తెదేపాలో చేరాయి. పుత్తూరు: భానుప్రకాష్‌.. గేటుపుత్తూరు, బజారువీధి, కాపువీధుల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీపీలు ఏలుమలై, గంజి మాధవయ్య, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాలి జీవరత్నం, ధనపాల్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్లు యుగంధర్‌, కరుణాకరన్‌, కౌన్సిలర్‌ రాధ, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు గణేష్‌, జిల్లా బీసీసెల్‌ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి పాల్గొన్నారు. బంగారుపాళ్యం: మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్‌నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శేషాపురానికి చెందిన 20 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. ధరణినాయుడు, జనార్థన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ జయచంద్రనాయుడు పాల్గొన్నారు. తవణంపల్లె: తెదేపా నాయకులు.. అరగొండలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరచౌదరి, మండల గౌరవాధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, మండల అధ్యక్షుడు దిలీప్‌నాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ భాస్కర్‌నాయుడు, ఏఎంసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అమరేంద్ర నాయుడు, అర్ధగిరి ఆలయ మాజీ ఛైర్మన్‌ జెట్టిపల్లి శ్రీనివాసులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు సునీల్‌కుమార్‌, మోహన్‌నాయుడు, కోదండయ్య, వినాయకం పాల్గొన్నారు. ఐరాల: తెలుగురైతు జిజిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబునాయుడు.. పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చారు.

చిత్తూరు(జిల్లా పంచాయతీ):  మాట్లాడుతున్న గురజాల జగన్‌

పూతలపట్టు: బండపల్లెలో ప్రచారంలో దగ్గుమళ్ల, మురళీమోహన్‌, సీకేబాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని