logo

అసంపూర్తి భవనాలే.. అభివృద్ధి కలే

ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు.

Published : 07 May 2024 03:01 IST

వెంగంవారిపల్లెలో అసంపూర్తిగా సచివాలయ భవనం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు. జిల్లాలో వందల సంఖ్యలో అసంపూర్తి భవనాలే దర్శనమిస్తున్నాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు అందక పనులు మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. కొన్నిచోట్ల భవన నిర్మాణాలు పూర్తి చేసినా గుత్తేదారులు బిల్లులు అందక.. అధికారులకు అప్పగించడం లేదు. వీటి పనే ఇలా ఉంటే.. ఇక గ్రామాభివృద్ధి ఏం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పురోగతి ఇలా.. జిల్లాలో 518 సచివాలయ భవనాలకు 188.10 కోట్ల నిధులు కేటాయించారు. వీటిలో పూర్తయినవి 340 మాత్రమే. 157 భవనాలు వివిధ దశల్లో ఉండగా 24 చోట్ల పనులే ప్రారంభం కాలేదు. 351 వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణానికి రూ. 73 కోట్లు విడుదల కాగా.. 159 చోట్లే పూర్తి చేశారు. 137 వివిధ దశల్లోనూ, 52 చోట్ల నిర్మాణం ప్రారంభించలేదు. 504 రైతు భరోసా కేంద్రాలకు 109.87 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 338 భవనాలు పూర్తి కాగా.. 99 అసంపూర్తిగానే మిగిలాయి. 62 చోట్ల పనులు మొదలే కాలేదు.

పాతపేటలో రైతు భరోసా కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని