logo

తాతను చంపిన మనవడికి జీవిత ఖైదు

తాతను చంపిన మనవడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామానికి చెందిన వనుం వెంకటేష్‌ చిన్నతనంలోనే తల్లి మృతి చెందడం, తండ్రి పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య కాండ్రేగుల సత్యనారాయణ, నూకాలమ్మ

Published : 21 Jan 2022 04:42 IST

కోరుకొండ, న్యూస్‌టుడే: తాతను చంపిన మనవడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామానికి చెందిన వనుం వెంకటేష్‌ చిన్నతనంలోనే తల్లి మృతి చెందడం, తండ్రి పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య కాండ్రేగుల సత్యనారాయణ, నూకాలమ్మ పెంచి పెద్ద చేశారు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండటంతో తాతయ్య మందలించేవాడు. గతేడాది జనవరి రెండో తేదీ రాత్రి 9గంటల సమయంలో తాత, మనవడి మధ్య వాగ్వాదం జరిగింది. పక్కనే ఉన్న కర్రతో వెంకటేష్‌ గట్టిగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. నూకాలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఎస్సై విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేయగా, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి దర్యాప్తు చేసి సాక్ష్యాలను కోర్టుకు అప్పగించారు. పీపీ ఎంఏ భాషా వాదనలు పినిపించగా న్యాయమూర్తి గురునాథ్‌ ముద్దాయికి జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని