logo

తలుపులమ్మ జాతర

ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ తలుపులమ్మ జాతరోత్సవాలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. 12 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

Updated : 26 Mar 2023 04:53 IST

తపులమ్మ జాతర ఏప్రిల్‌ 9 నుంచి

లోవ తలుపులమ్మ క్షేత్రం

తుని గ్రామీణం: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ తలుపులమ్మ జాతరోత్సవాలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. 12 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.10 లక్షలు వ్యయం చేయనున్నారు. ఈ మేరకు శనివారం ఆలయ పాలకమండలి సభ్యులు, లోవకొత్తూరు గ్రామపెద్దలతో ఈవో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలంకరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలకు సంబంధించి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్‌ గొర్లి అచ్చియ్యనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని