హిజ్రా హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన హిజ్రాహత్యకేసును పోలీసులు ఛేదించారు. వివరాలను అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ షేక్ ఖాదర్ బాషా బుధవారం విలేకరులకు తెలిపారు.
అమలాపురం పట్టణం: ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన హిజ్రాహత్యకేసును పోలీసులు ఛేదించారు. వివరాలను అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ షేక్ ఖాదర్ బాషా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 13న జొన్నాడ నేషనల్‌హైవే ఆనుకుని పంటకాలువలో ధవళేశ్వరానికి చెందిన మరపట్ల ఆనంది అనే హిజ్రాను పీక కోసి చంపినట్లు గుర్తించామన్నారు. ఆనంది గురువు ధనాల మందాకిని ఫిర్యాదు మేరకు ఆలమూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శివప్రసాద్ కేసు నమోదు చేశారన్నారు. ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణ పర్యవేక్షణలో రావులపాలెం సీఐ రజనీకుమార్ దర్యాప్తు చేపట్టారన్నారు. ఆనందితో పరిచయం ఉన్న కేతా భరత్ వెంకట సుధీర్ అలియాస్ (పెద్ద కేతా), అతని స్నేహితులైన వీలు కల్యాణ్ అలియాస్ (పెద్ద కల్లీ), సింగంపల్లి కార్తికేయ అలియాస్ సింభ, (సోనూ)లను విచారించగా హత్య బండారం బయటపడిందన్నారు. 12వ తేదీ రాత్రి పెద్ద కేతా స్నేహితురాలైన ఆనంది (హిజ్రా), సోనూతో కలిసి మోటారు వాహనంపై మద్యం సీసాలతో ఎక్కించుకుని జొన్నాడ శివారు పంటకాలువ వద్దకు తీసుకొచ్చారు. వారు ఫోన్ చేయడంతో అక్కడకు పెద్ద కల్లీ చేరుకుని నలుగురు కలిసి మద్యం తాగుతుండగా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని పెద్దకేతా కోపంతో తన వద్దనున్న బటన్ నైఫ్‌తో ఆనంది నడుము మీద పొడిచాడు. సోనూ కాళ్లు పట్టుకోగా కల్లీ అదే కత్తితో వివిధ భాగాల్లో కోసివేయగా సోనూ బీర్‌బాటిల్‌తో తల మీద కొట్టి పంటబోదిలోకి నెట్టివేశారన్నారు. అప్పటికి కొన ఊపిరితో కదలుతూ ఉండటంతో గమనించిన కల్లీ ఆనంది మెడను వెనక్కి లాగి కత్తితో పీకను కోసి చంపారన్నారు. సమావేశంలో క్రైమ్ సీఐ గోవిందరావు, ఎస్‌బీ సీఐ రజనీకుమార్, సీఐ రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.