logo

అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..

ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్‌మోహన్‌రెడ్డి  ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు.

Updated : 05 May 2024 04:08 IST

పోలీసు అధికారులకు పట్టుబడిన సారా (పాతచిత్రం)

మాట తప్పను.. మడమ తిప్పను.. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలో పూర్తిగా మద్యం లేకుండా చేస్తాను..

ఇదీ 2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సభలోనూ చెప్పిన మాటలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నేరవార్తలు

ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్‌మోహన్‌రెడ్డి  ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. ఐదేళ్లు గడిస్తేగాని వాస్తవం అర్థంకాలేదు.. ప్రభుత్వంలోకి వచ్చాక.. దశలవారీగా మద్యపాన నిషేధమన్నారు.. పైగా ధరలు పెంచి మద్యానికి దూరం చేస్తామని కొత్తభాష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కేవలం అయిదు నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏరులై పారుతోంది. అన్నిచోట్లా విరివిగా దుకాణాలు, బార్లు వెలిశాయి. ఏ వీధిలో చూసినా బెల్టు  షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.  అసలు బ్రాండ్లను తరిమేసి వింత పేర్లతో కొత్తకొత్త రకాలు తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇష్టానుసారం ధరలు పెంచి రోజువారీ కూలీలు, సామాన్యుల వెన్ను విరిచారు. కల్తీమద్యం అమ్మకాలకు అనుమతులిచ్చి మధ్యతరగతి ప్రజానీకాన్ని అనారోగ్యం పాల్జేశారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఒక్కో సీసాపై మూడింతల ధర పెంచారు. మద్యనిషేధ]ం మాట దేవుడెరుగు.. జగన్‌ సర్కారుకు అదే ప్రధాన వనరుగా మారిపోయింది.

అబ్కారీని కాదని.. సెబ్‌ ఏర్పాటు..

మద్యం అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్రంలో అబ్కారీ(ఎక్సైజ్‌) శాఖ ఉంది. దానిని కాదని ప్రభుత్వం సెబ్‌ ఏర్పాటు చేసింది.  రెండు శాఖలు సమన్వయంతో పనిచేసినా అక్రమ రవాణా నియంత్రించలేకపోయారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాల్లో పలు రకాలు విక్రయిస్తుండగా.. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో నాసిరకాన్ని కూడా కల్తీచేసి ప్రాణాలతో చలగాటం మాడుతున్నారు. జిల్లాలో గత నాలుగు నెలలుగా చేసిన దాడుల్లో 1400 పైగా కేసులు నమోదు చేసి వేల లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నారు. సారాబట్టీలకు కొదవే లేదు. రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని ఒకప్పుడు లంకలకే పరిమితమైన సారాబట్టీలు నేడు పిడింగొయ్యి, హుకుంపేట గ్రామ శివారుల్లో వెలిశాయి నగరంలోని పాతసోమాలమ్మ గుడి, మేదరపేట ప్రాంతాల్లో సారా ఏరులై పారుతోంది. ఆయా ప్రాంతాల్లో నిత్యం ఒకరిద్దరు.. మద్యంతోనో, సారాతోను పోలీసులకు పట్టుబడుతుంటారు. దీని నియంత్రణకు చేస్తున్న ప్రయాత్నాలన్నీ నీరుగారిపోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని