logo

నూతన భూహక్కు చట్టంపై జగన్‌ సర్కారునే ప్రశ్నించాలి

ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్‌మోహన్‌రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కేవలం సూచించిందన్నారు.

Published : 06 May 2024 06:16 IST

దీనిని అమలు చేయమని నీతిఆయోగ్‌ ఎక్కడా చెప్పలేదు  
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్‌మోహన్‌రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కేవలం సూచించిందన్నారు. దీన్ని అమలు చేయమని, కచ్చితంగా చట్టం ఉండాలని చెప్పలేదన్నారు. అమలు విషయంలో ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారనే దానిపై ఆ రాష్ట్ర ప్రభుత్వమే వివరణ ఇవ్వాలన్నారు. కావాలనే ఈ చట్టంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. భాజపా అధికారంలోకి రాగానే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తున్నామని అధికార పార్టీ నేతలు తనపైన కూడా అసత్య ప్రచారాలు చేశారని గుర్తుచేశారు. సోమవారం రాజమహేంద్రవరంలో జరగనున్న ప్రధానమంత్రి మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ద్వారా రాష్ట్రానికి దశ-దిశ నిర్దేశం చేయనున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని