logo

వీధి వీధినా వెతలు.. పట్టించుకునేదెవరు..

నగరంలోని 25వ డివిజన్‌లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త,

Published : 07 May 2024 04:27 IST

తాగునీటి కొళాయి లీకులు

న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు, కంబాలచెరువు: నగరంలోని 25వ డివిజన్‌లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త, కచ్చా డ్రెయిన్లలో పూడిక తీయకపోవడం, ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్‌ తదితర సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. వేల మంది జనాభా నివాసం ఉంటున్నా సమస్యలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూడికతో నిండిన కాలువ


ఇవీ ఇక్కట్లు

  • డివిజన్‌లోని ప్రధాన మార్గాలైన నేతాజీ పాఠశాల నుంచి పెద్ద మసీదుకు వెళ్లే రోడ్డు, దానికి  అనుసంధానంగా ఉన్న అంతర్గత రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గుంతలతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
  • మెయిన్‌ రోడ్డుకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అంతర్గత రోడ్లు ఛిద్రమవడంతో రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. వీధి మలుపుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది.
  • రోడ్ల పక్కన కాలువలపై స్లాబులు సక్రమంగా లేవు. విరిగిపోవడంతో ఊచలు పైకి తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. రోడ్ల మధ్య పలకల అమరిక లేక రాత్రి సమయాల్లో వాహనదారులు పడి పోతున్నారు.
  • కొన్ని ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతో వాడుక నీరు వెళ్లేదారి లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు.
  • కొన్నిచోట్ల డ్రెయిన్లలో చెత్త వేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు.  

వివరాలు

డివిజన్‌: 25
పరిధి: రంభ, ఊర్వశి, మేనక థియేటర్‌, శిక్షణ కళాశాల, గ్రంధివారివీధి తదితర ప్రాంతాలు
జనాభా: సుమారు 5 వేలు


ఇబ్బందులు తొలగించాలి..
- రమేష్‌, స్థానికుడు

మా ప్రాంతంలో తాగునీరు సక్రమంగా రావడం లేదు. కొన్నిచోట్ల వృథాగా పోతోంది. వృథాను అరికట్టి సక్రమంగా పంపిణీ చేయాలి. వీధి దీపాలు సైతం వెలగక రాత్రి సమయాల్లో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. అంతర్గత రహదారులకు మరమ్మతులు చేసి ఇబ్బం దులు తొలగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని