logo

జాతీయ నాటికల పోటీలకు సర్వం సిద్ధం

పుచ్చలపల్లి సుందరయ్య 20వ జాతీయ స్థాయి నాటికల పోటీలు శుక్రవారం యడ్లపాడులో ప్రారంభం కానున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గతేడాది నుంచి కమిటీ సభ్యులు కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

Published : 31 Mar 2023 05:34 IST

నేటి నుంచి యడ్లపాడులో ప్రారంభం

గ్రామస్థులకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్న నిర్వాహక కమిటీ సభ్యులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: పుచ్చలపల్లి సుందరయ్య 20వ జాతీయ స్థాయి నాటికల పోటీలు శుక్రవారం యడ్లపాడులో ప్రారంభం కానున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గతేడాది నుంచి కమిటీ సభ్యులు కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా యడ్లపాడులో బుధవారం ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలను ఆయా కుటుంబ సభ్యులకు అందజేసి నాటికల పోటీలకు సాదరంగా ఆహ్వానించారు. ప్రదర్శనలు తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు పోటీల అనంతరం లక్కీడ్రా తీసి బహుమతులు ఇవ్వనున్నారు. 15 మంది న్యాయనిర్ణేతలు, 100 మంది ప్రజా నాట్యమండలి కళాకారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు ముత్తవరపు సురేష్‌బాబు, నూతలపాటి కాళిదాసు, జరుగుల శంకరరావు, ముత్తవరపు పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శించే నాటికలు ఇవి

ఈనెల 31న.. పరుచూరి వెంకటేశ్వరరావు రచనకు పి.బాలాజీనాయక్‌ దర్శకత్వం వహించిన చైతన్య కళా స్రవంతి విశాఖపట్టణం వారి ‘ఎస్‌11’ నాటిక. కె.శ్రీనివాసరావు మూలకథకు కేకేఎల్‌ స్వామి నాటకీకరణ, బీఎంఎస్‌ పట్నాయక్‌ దర్శకత్వం వహించిన శార్వాణీ గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బోరివంక (శ్రీకాకుళం) వారి ‘కొత్త పరిమళం’ నాటిక. చుండూరి ఉమాబాల మూలకథకు రావి నాగేశ్వరరావు నాటకీకరణ, జనాబ్‌ షహీన్‌షా దర్శకత్వం వహించిన రసవాహిని అమలాపురం వారి ‘స్వీకారం’ నాటిక.


ఏప్రిల్‌ 1న.. పి.దివాకర్‌ ఫణీంద్ర దర్శకత్వం, డాక్టర్‌ ఎం.ఎస్‌ చౌదరి రచించిన మోడ్రన్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ విజయవాడ వారి ‘కపిరాజు’ నాటిక. చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ఉషోదయ కళానికేతన్‌ కట్రపాడు వారి ‘ప్రక్షాళన’ నాటిక. శ్రీసత్యవతి రచించిన మూలకథకు వల్లూరి శివప్రసాదరావు నాటకీకరణ చేసి గంగోత్రిసాయి దర్శకత్వ వహించిన అరవింద ఆర్ట్స్‌ తాడేపల్లి వారి ‘వెండి అంచులు’ నాటిక.

ఏప్రిల్‌ 2న.. యల్లాప్రగడ భాస్కరరావు రచనకు వైఎస్‌ కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించిన రసఝరి నిడబ్రోలు (పొన్నూరు) వారి ‘కాపలా’ నాటిక. విజయార్కే మూలకథకు రావి నాగేశ్వరరావు నాటకీకరణ చేసి గోపరాజు దర్శకత్వం వహించిన శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకలూరు వారి ‘ప్రేమతో నాన్న’ నాటిక. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు బి.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన పండు క్రియేషన్స్‌ కొప్పోలు వారి ‘పక్కింటి మొగుడు’. చివరిగా ప్రత్యేక ప్రదర్శనగా జరుగుల రామారావు రచనకు డా.రాజ్‌ఏ దర్శకత్వం వహించిన క్రాంతి క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారి ‘వేలి మీద సిరా చుక్క’ నాటిక ప్రదర్శనలకు ఎంపికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని