logo

గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు.

Published : 26 Apr 2024 05:20 IST

గుంటూరు రైల్వే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. మార్చి 28 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌లో 23.40 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07234) నడికుడి 02.08, సత్తెనపల్లి 03.10, గుంటూరు 04.35, విజయవాడ 05.55, సంత్రాగచి మంగళవారం 05.00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07235) మార్చి 30 నుంచి జులై 2వ తేదీ వరకు ప్రతి మంగళవారం సంత్రాగచిలో 12.20 గంటలకు బయలుదేరి విజయవాడ బుధవారం 08.45, గుంటూరు 09.55, సత్తెనపల్లి 10.40, నడికుడి 11.40, సికింద్రాబాద్‌ 15.00 గంటలకు వెళ్తుంది.

పలు రైళ్ల రద్దు : ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున ఈనెల 29 నుంచి మే 22వ తేదీ వరకు పలు రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు.విజయవాడ-గుంటూరు(07783), గుంటూరు - విజయవాడ (07788), గుంటూరు-మాచర్ల(07779),మాచర్ల-గుంటూరు (07780) చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని