logo

జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు

ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు.

Published : 26 Apr 2024 05:21 IST

బాపట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. మధ్యాహ్నం 3గంటల లోపు వచ్చిన వారిని ఆర్వో కార్యాలయాల్లోకి అనుమతించారు. సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18వ తేదీ నుంచి 25 వరకు జిల్లాలో ఓ లోక్‌సభ, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 152 మంది అభ్యర్థుల    నుంచి మొత్తం 249 నామినేషన్లు వచ్చాయి. బాపట్ల లోక్‌సభకు 20 మంది అభ్యర్థులు 34 నామినేషన్లు దాఖలు చేశారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు 132 మంది అభ్యర్థులు, 215 నామపత్రాలు అందజేశారు. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు కావటంతో నామపత్రాలు వేసే అభ్యర్థులు, నేతలు, శ్రేణులతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని