logo

పోరు.. ఖరారు!

గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం.

Published : 30 Apr 2024 06:30 IST

పార్లమెంటు పోటీలో 30 మంది
శాసనసభకు 132 మంది అభ్యర్థులు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు కలెక్టరేట్‌: గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. 1996లో అత్యధికంగా 32 మంది పోటీపడగా ఇప్పుడు 30 మంది బరిలో ఉన్నారు. జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాలకు 132 మంది పోటీ పడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఇక్కడి నుంచి అంత మంది పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి తెదేపా తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీ చేస్తుండడంతో పలువురు ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. మంగళగిరి తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 28 మంది పోటీ పడుతున్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ముగియడంతో బరిలో ఉన్నవారి పేర్లను ప్రకటించి వారికి గుర్తులు కేటాయించారు.

మంగళగిరిలో మూడు బ్యాలట్‌ యూనిట్లు.. ఒక్కొక్క బ్యాలట్‌ యూనిట్‌లో 15 మంది అభ్యర్థులు, వారి గుర్తులు, ఒక నోటాకు సరిపోతుంది. ఈ లెక్కన మూడు బ్యాలట్‌ యూనిట్లు పెట్టాల్సి ఉంది. గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది పోటీపడుతున్నందున రెండు బ్యాలట్‌ యూనిట్లు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లాకు అవసరమైన బ్యాలట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్‌లు ఇతర సామగ్రి మొత్తం తనిఖీ చేసి పోలింగ్‌కు సిద్ధం చేశారు. బ్యాలట్‌ యూనిట్లు పెరిగే కొద్దీ సిబ్బందికి పనిభారం పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఈవీఎంలు సమకూర్చుకోవడం నుంచి పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగడానికి అవసరమైన చర్యలు చేపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని